హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 18: సీబీఐకి కేసు ఇచ్చాక మమత ప్రభుత్వం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన విధ్వంసం గురించి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా ఇలా కీలక వ్యాఖ్యలు చేస్తూ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. నిరసనకారులపై టీఎంసీ గూండాలు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.