సంగారెడ్డి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య?హ్యూమన్ రైట్స్ టుడే/సంగారెడ్డి జిల్లా/ఆగస్టు 09: యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోమడుగు గ్రామానికి చెందిన తేజేశ్వని బీఫార్మసీ చదువుతోంది. తనను ప్రేమించా లంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ విద్యార్థినినీ, ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేస్తున్నారు.
దీనిపై పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ పెట్టినా వేధింపులు ఆగలేదు. దీంతో ఏమీ తోచని పరిస్థితుల్లో ఆ యువతి తాను ఉంటున్న భవనం నాలుగు అంతస్తుల పై నుండి కిందకు దూకి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది.
వెంటనే కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు యువతిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గ మధ్యంలో తేజేశ్వని మృతి చెందింది. ఆత్మహత్యకు గ్రామంలోని గంజాయ్ బ్యాచ్ కారణమంటూ బంధువులు ఆందోళనకుదిగారు.
నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.