నిర్మాణ లోపాలతోనే కుప్పకూలిన వాల్?

Get real time updates directly on you device, subscribe now.

డేంజర్ లో సుంకిసాల..పంప్ హౌస్ లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్..

హ్యూమన్ రైట్స్ టుడే/తెలంగాణ / 09 ఆగష్టు: సాగర్లో వాటర్ ప్రెజర్తో భారీ ప్రమాదం ఎన్నికల్లో లబ్ధి కోసం గత సర్కారు హయాంలో హడావుడిగా పనులు ఆగస్టు 1న ఘటన ఆలస్యంగా వెలుగులోకి మోటార్లు బిగించక ముందే వాల్ కూలడంతో ప్రాజెక్టుపై నీలినీడలు
ప్రమాదంపై విచారణకు మెట్రో వాటర్ బోర్డు కమిటీ
నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామని వెల్లదించారు.
సుంకిశాల వద్దని ఆనాడే చెప్పిన: గుత్తా సుఖేందర్
హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం నల్గొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జల మండలి నిర్మి స్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఈ నెల1న రిటైనింగ్వాల్, దాని వెనుక భాగంలోని గేట్ నిట్ట నిలువునా కూలిపోయాయి. దీంతో పనుల నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వారం కింద జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు.

కాగా, గురువారం సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పంప్హౌస్ ప్రమాద ఘటనపై మెట్రోవాటర్బోర్డు అలర్ట్ అయింది. మోటార్లను బిగించక ముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్టు గురువారం ప్రకటించింది.

విచారణ కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ను నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై తగిన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సిన సుంకిశాల ప్రాజెక్టు. ఈ ఘటన వల్ల మరి కొన్ని నెలలు ఆలస్యం కానున్నది. అయితే, ఈ ఘటన వల్ల హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అధికారులు తాజాగా స్పష్టం చేశారు. ప్రస్తుతం సరఫరా అవుతున్నట్టే కృష్ణా మూడు దశల ద్వారా నీటి సరఫరా యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

వేసవిలో సాగర్ జలాలు అడుగంటితే పుట్టంగండి వద్ద తాత్కాలికంగా పంపులను ఏర్పాటు చేసి, గ్రేటర్ హైదరాబాద్కు వాటర్ తరలిస్తున్నారు. అలా కాకుండా సాగర్ డెడ్ స్టోరేజీకి చేరినా పంపింగ్చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల వద్ద “రా” వాటర్ ఇన్టెక్ వెల్ నిర్మించాలని నిర్ణయించింది.

అప్పటికే నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీని పూర్తిచేస్తే గ్రావిటీ ద్వారా హైదరాబాద్కు నీటిని తరలించే వీలుందని, సుంకిశాల అవసరం లేదని నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు ఎంత చెప్పినా నాటి ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదు. పనులను దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ 2021 జూన్ 11న వాటర్బోర్డుతో ఒప్పందం చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఆగమేఘాల మీద సుంకిశాల పనులు మొదలు పెట్టింది.

ఎన్నికలకు ఏడాది ముందు 2022 మే 14 న అప్పటి మంత్రి కేటీఆర్ ఇన్టెక్ వెల్ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేండ్లలోనే మొత్తం పనులు కంప్లీట్ చేసి, హైదరాబాద్కు తాగునీటిని సప్లై చేయాలని భావించారు. కానీ, సాగర్లో నీటి నిల్వలు పెరిగిపోవడంతో మధ్యలో కొంతకాలం పనులు ఆపేశారు. మళ్లీ గతేడాది నుంచి వానల్లేక సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పనులు వేగవంతం చేశారు. ఏడాది తిరగక ముందే సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో సుంకిశాల లోపం బయట పడింది.

నిర్మాణ లోపాలతోనే కుప్పకూలిన వాల్?

2021లో రూ.2,200 కోట్లకు మేఘా సంస్థ ఈ పనుల కాంట్రాక్టు దక్కించుకోగా ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇన్టెక్ వెల్లో సంపు, పంపు హౌస్, 3 టన్నెళ్లు, పంప్ హౌస్ సూపర్ స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. పంపింగ్ మెయిన్స్లో 50 కి.మీ. మేర 3 వరుసల 2,325 ఎంఎం డయా పైపు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రో మెకానికల్ పనుల్లో భాగంగా పంపులు, మోటార్లు, సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ మిషన్ మెయిన్స్ నిర్మిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్టు ఇన్టెక్ వెల్ పనులు ఇప్పటి వరకు 60 శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70 శాతం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40 శాతం పూర్తయ్యాయి.

అన్నీ అనుమానాలే..

సాగర్ రిజర్వాయర్లోకి భారీ స్థాయిలో వరద వస్తుందని ఊహించలేకపోయామని జలమండలి అధికారులు చెప్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. శ్రీశైలం నుంచి సాగర్లోకి వరద జులై నెలాఖరు నుంచి మొదలైంది. ఆగస్టు 1న సాగర్ నీటిమట్టం 530 అడుగులు మాత్రమే ఉంది. 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు నీటి మట్టాలు పడిపోయినా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్లోకి నీటిని తరలించే విధంగా డిజైన్ చేశారు. కానీ 530 అడుగుల మేర 169 టీఎంసీల నీటి ధాటినే రిటైనింగ్వాల్ఆపలేకపోవడం నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపుతున్నది.

వాస్తవానికి పంపుహౌస్లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తిచేస్తారు. కానీ, ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు. రిటైనింగ్ వాల్, గేట్ల నిర్మాణం పూర్తికావడం, సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సాగర్లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం గుండా పంపుహౌస్లోకి నీరు ప్రవేశించే క్రమంలో ఒత్తిడికి గురై, రిటైనింగ్వాల్ కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి.

వాటర్ లీక్ అవుతున్నట్టు పనిచేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. వాల్ కూలిపోతుందన్న భయంతోనే ఆగస్టు 1న ఉదయం పని ముగించుకుని పంపుహౌస్ నుంచి వెళ్లిపోయిన సిబ్బంది ప్లేస్లో రెండో షిఫ్ట్లో పని చేయడానికి సిబ్బంది రాలేదు. ఆలోగానే రిటైనింగ్ వాల్ కూలి పోవడంతో తామంతా భయ బ్రాంతులకు గురయ్యాయని సిబ్బంది తెలిపారు. మోటార్లు బిగించక ముందే రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు పైన నీలినీడలు కమ్ముకున్నాయి.

అంతా ఐదు నిమిషాల్లోనే..

సాగర్కు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో బ్యాక్ క్లోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్లోకి వచ్చినట్టు వాటర్బోర్డు అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై, దానికి అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ కూలి పోయినట్టు వెల్లడించారు. ఇదంతా 5 నిమిషాల్లోనే జరిగిందని తెలిపారు. రిజర్వాయర్ సంపు పూర్తి స్థాయిలో నిండిందని చెప్పారు.

నీటి లెవల్ తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. దీనికయ్యే ఖర్చు నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు. కాగా, ఈ ఘటన ఆగస్టు 2న ఉదయం 7 గంటల టైంలో జరిగిందని, అందువల్ల ఆ టైంలో సైట్ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది సంఘటనా స్థలంలో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందన్నారు.

సుంకిశాల వద్దని ఆనాడే చెప్పిన: గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్‌ జంట నగరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని తాను ఆనాడే కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదని, దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ”ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ద్వారా గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఏకేబీఆర్‌ లిఫ్ట్ కూడా ఉండగా కొత్తగా సుంకిశాల ఎందుకు? అయినా అప్పటి ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లింది.

ప్రస్తుతం కుప్పకూలిన సుంకిశాలకు పెట్టిన రూ.2 వేల కోట్లతో సొరంగం పూర్తయ్యేది. చైర్మన్‌ హోదాలో నేను సలహా మాత్రమే ఇవ్వగలను. ఒత్తిడి చేయలేను. ఎస్ఎల్బీసీ పూర్తయితే 10 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment