హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/09 ఆగష్టు: రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను కమిటీ సిఫారసు చేయాల్సి ఉంది.