తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. సికింద్రాబాద్ సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆమె నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. వేడుకల్లో సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.