హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 ఆగష్టు:
ఇవాళ్టి నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. శ్రావణమాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమ- పరమేశ్వరుడు, మంగళ- గౌరీవ్రతం, బుధ- విఠలేశ్వరుడు, గురు- గురుదేవుడు, శుక్ర-లక్ష్మీదేవి, శని-శనీశ్వరుడు, వేంకటేశ్వరుడికి పూజలు చేయాలట. పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం (ఆగస్టు 16న) వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుతారు. వీటితో పాటు సత్యనారాయణ స్వామి, మంగళగౌరీ వ్రతాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.