విలేఖరులారా వీరితో కాస్త జాగ్రత్త..!
1. ప్రచార ఆర్భాటం కోసం పత్రికల్లో వార్తలు వ్రాయించుకొని విలేకరులను పట్టించుకోని వారితో….
2. వారి గొప్పలకు పత్రికల్లో రాయించుకొని కనీస మర్యాద ,గౌరవం ఇవ్వని వారితో..
3. వేతనం లేకుండా పరోక్షంగా ప్రజాసేవ చేస్తున్న విలేఖరులను గుర్తించని పెద్దమనుషులు,పలు రాజకీయ నాయకులతో..
4. తాము చేసిన కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం అయిన తర్వాత రాత్రి 7 గంటలకో, 8 గంటలలకో గుర్తొస్తే వాట్సప్ లో ఫోటోలు పంపి నీ ఇష్టం ఉంటే రాసుకో లేదంటే మూసుకో అని పంపే వారితో.
5. పాలకుల, అధికారుల అవినీతిని తమ కలంతో రాసి ప్రజలలో చైతన్యం తీసుకవస్తే మద్దతు ఇవ్వకుండా దాడులు, బెదిరింపులకు పాల్పడే వారితో జర జాగ్రత్తగా ఉండటం మంచిది.
Editor