స్నేహం ఓ దివ్య ఔషధం..!

Get real time updates directly on you device, subscribe now.

ఏ’ బి ‘సి లాఫింగ్ క్లబ్ అత్తాపూర్ యోగా సెంటర్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బి. సీతారాం!!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 ఆగష్టు:
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనేది ప్రతి వ్యక్తి జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఆందోళనను తుంచి ఆనందాన్ని పెంచటంలో స్నేహం  దివ్య ఔషధం అని ఏ’ ‘బి’ సి లాఫింగ్ క్లబ్ అత్తాపూర్ యోగా సెంటర్ గౌరవాధ్యక్షులు ప్రముఖ’ డాక్టర్’ బి ‘సీతారాం అన్నారు.
ఆదివారం లక్ష్మీ నగర్ కాలనీ జి’హెచ్’ఎం’సి పార్క్ లో ఏ ‘బి సి: లాఫింగ్ క్లబ్’ అత్తాపూర్ యోగా సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం వేడుకలు అత్తాపూర్ యోగా సెంటర్ గురువు బి.సుధాకర్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని గుర్తుగా యోగా సెంటర్ లో సుధాకర్ గౌడ్, కేక్ కట్ చేసి మాట్లాడుతూ అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పదని వ్యక్తిని ఒంటరితనము నుండి  స్వేచ్చా ప్రపంచంలోకి తెచ్చేది స్నేహమని గొప్ప స్నేహితులు ప్రాణాలను కాపాడే అమృతం లాంటి వారిని స్నేహం నమ్మకానికి పునాది అని స్నేహం చేయడం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని అన్నారు.
ఏ ‘బి: సి’ లాఫింగ్ క్లబ్ అత్తాపూర్ యోగ సెంటర్ కార్య నిర్వాహక ‘అధ్యక్షులు ప్రముఖ’ డాక్టర్’ బి’ భానుమతి మాట్లాడుతూ స్నేహం అద్దం లాంటిది గాయపడిన మనసును సరిచేసుకునేందుకు స్నేహానికి మించిన ఔషధం లేదు. ఇచ్చింది మర్చిపోవడం పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడం. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అంటూ జయరాజు రాసిన పాట స్నేహ బంధానికి నిలువెత్తు నిదర్శనం అని స్నేహంతో ధైర్యం స్నేహంతో ఆరోగ్యం ఆనందం సిద్ధిస్తుందని, ఎవరు దోచుకోనిది తరాలు మారిన తరగని పెన్నిధి కుల మతాలకతీతమైంది స్నేహబంధం స్నేహం మధురమైనది  అన్నారు. దాన్ని పరిమలింప చేయటం సామాజిక బాధ్యత అన్నారు.
ఏ ‘బీ ‘సి లాఫింగ్గ్ క్లబ్ ‘అత్తాపూర్’ కో కన్వీనర్ ప్రముఖ వ్యక్తిత్వ వికాసనిపుణులు ఎస్.మహేందర్ మాట్లాడుతూ
నేటి హైటెక్ కల్చర్లో ఉరుకుల పరుగుల జీవితంలో స్నేహం శాంతాన్ని స్వస్థతను మనోశాంతిని కల్పించే సాధనమని తల్లి తండ్రి గురువు దైవం తర్వాత స్థానం స్నేహితుడుధేనని ఎల్లవేళలా స్నేహాన్ని గౌరవిద్దాం స్నేహం చేద్దాం స్నేహాన్ని విస్తరిద్దాం స్నేహంతో తరిద్దామని అన్నారు.
ఏ ‘బి ‘సి ‘లాఫింగ్ క్లబ్ అత్తాపూర్ యోగా సెంటర్ సీనియర్ సభ్యులు నరసింహ మాట్లాడుతూ ప్రపంచ ఆదర్శ స్నేహితులు శ్రీకృష్ణ కుచేలుడు కృష్ణుడు ధనికుడు కుచేలుడు పేదవాడైన స్నేహానికి అడ్డు రాలేదు. ఆర్థిక అసమానతలు కుల మతాలకు అతీతమైంది స్నేహ బంధం. ఎల్ల వేళలా స్నేహాన్ని గౌరవించడం భారతీయ సంస్కృతి అని ఆదర్శనియమైన స్నేహం సమాజానికి అనుసరణీయం కావాలని అన్నారు.
తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరు కనకయ్య మాట్లాడుతూ కుటుంబంలో యుక్త వయసు వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండ గలిగితే యువతలో కలిగే ఆందోళనలను ఆత్మ హత్యలను అడ్డుకోవచ్చునని, అందుకు కుటుంబమే స్నేహానికి పునాది కావాలని సూచించారు.
ఈ వేడుకల్లో ఏ ‘బీ’సీ’ లాఫింగ్ క్లబ్’ అత్తాపూర్ యోగా సెంటర్ సభ్యులు ఎన్.ప్రభాకర్ రావు, శ్రీరామ్ రెడ్డి, భుజంగ రెడ్డి, పి గోపాల్ రెడ్డి, రవి, శ్రీకాంత్ ఎస్, వి.రంగారావు, సోమేష్, శ్రీనివాస్ చారి, బి శ్రీనివాస్,
డాక్టర్ బి భానుమతి, పీ సుజాత, సుజాత, వసుమతి, సీతా, ఎన్.సరిత కుమారి, శ్యామల, విజయ శ్రీ, శమంతక మణి, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment