పోలీసులు, ప్రభుత్వ అధికారుల వద్ద నకిలీ విలేకరులకే గౌరవం..!!
కుప్పలు తెప్పలుగా జర్నలిజంలోకి దొంగలు..!
విలేకరులు కావలెను అను ప్రకటనలు చట్టబద్ధంగా ఉండాలి..!!
రెగ్యులర్ ఉద్యోగ ప్రకటనల్లో పొందు పరిచే వివరాలు విలేకరులు కావలెను అను ప్రకటనల్లో తప్పనిసరిగా అమలు చేయాలి.
యువత మేలుకో విలేకరులు కావలెను అను ప్రకటనలను పరిశీలించండి..!!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 ఆగష్టు: విలేకరులు కావలెను గత కొన్నేళ్లుగా ఈ ప్రకటన ముసుగులో జర్నలిజం వృత్తిలోకి అచ్చంగా దొంగలే వస్తున్నారు. అంటే ఈ ప్రకటన ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. డిజిటల్ మీడియా ప్రాచుర్యం పెరిగాక ప్రతివాడు ఒక పేపర్, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుం టున్నారు. ఇంత వరకు ఓకే ఇలా అన్నీ తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ లు పెట్టుకునేట్లయితే సమస్య లేదు. కానీ అక్రమ సంపాదన, యాడ్స్ పేరిట దోపిడీ చేసే అవకాశం మీడియా రంగంలో బాగా ఉన్నందున ఈ రంగానికి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతివాడు ఏదో ఒక పేరుతో పేపర్, ఛానల్ పెట్టేసి ఇక వాళ్ళ ఇష్టం రెగ్యులర్ మీడియాలా సీ.ఈ.ఓ, చీఫ్ ఎడిటర్, స్టేట్ బ్యూరో, రీజనల్ కో-ఆర్డినేటర్ ఇలా మీడియా రంగంలో ఉండే హోదాలతో చెలరేగి పోతున్నారు. ఏపీ రాజధాని అమరావతి నేపధ్యంలో ఈ నకిలీ జర్నలిస్ట్ ల హవా ఈ మధ్య విజయవాడ-గుంటూరు నగరాల మధ్య బాగా ఉంది. రెగ్యులర్ మీడియాని సైతం సవాల్ చేస్తూ ఈ నకిలీ గాళ్ళు రెచ్చిపోతున్నారు.
విలేకరులు కావలెను ప్రకటనలు బ్యాన్ చేయాలి..
ఇటువంటి ప్రకటనలు నమ్మి యువత పెద్ద ఎత్తున మోసపోతున్నారు. ఈ విధమైన ప్రకటనల పట్ల యువత ఆకర్షితులు అయ్యేముందు అసలు ఆ ప్రకటనలో క్లారిటీ ఉందా…లేదా….అనేది గ్రహించాలి. జర్నలిస్ట్ అనే పేరు, హోదా వెనుక “జర్నలిజం-జర్నలిస్ట్” లు ప్రధానంగా ఈ ప్రకటనలు నమ్మి జీవిత కాలం దగా పడుతున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసిన యువత చదువు, చేస్తున్న పనులు వదిలి విలేకరులు కావలెను అనే ప్రకటనల ఉచ్చులో చిక్కుకు పోతున్నారు. ఏ ప్రమాణాలు, వివరాలు లేకుండా ఆ ప్రకటనల వెంట పరుగులుపెట్టి, వారు ఇచ్చే టార్గెట్స్ కి అగ్రీ అయ్యి జీవితాలు చిన్నా భిన్నం అవుతున్నా జర్నలిస్ట్ అనే హోదా కోసం సర్వం దారపోస్తున్నారు. జర్నలిజంలోకి రావాలి అనుకునే యువత ముందుగా ఇటువంటి ప్రకటనలకు గుడ్డిగా ఆకర్షితులు కావద్దు.
అసలు ఇటువంటి ప్రకటనల్లో పని ఇది, ఈ పనికి జీతం ఇంత, టీఏ, డీఏ వంటి ఇతర వివరాలు ఏవీ ప్రకటనల్లో ఇవ్వరు. కానీ విలేకరులు కావలెను అని కలర్ ఫుల్ యాడ్ అంతే దానికే యువత పడిపోతున్నారు. ఆశక్తి కలిగిన వారు వెళితే జర్నలిజంలో ఓనమాలు తెలియని వారికి సైతం జర్నలిస్ట్ లుగా ఐడీ కార్డుల్లో రాష్ట్ర స్థాయి హోదాలు ఇక ఇవి అడ్డుపెట్టుకుని ఆయా ప్రాంతాల్లో వీర విహారం చేస్తున్నారు. పాపం ఏది రెగ్యులర్ మీడియా ఏది నకిలీ మీడియా తెలియక పోలీసులు, ప్రభుత్వ అధికారులు అసలు మీడియా కన్నా నకిలీ మీడియానే నమ్మేస్తున్నారు. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి ఏదో చూపించింది అన్నట్లు ఈ నకిలీ గాళ్ళ హెచ్చులు పోలీసులకు, పలువురు ప్రభుత్వ అధికారులకు కొరకరాని కొయ్యగా మారింది. ఇటువంటి నకిలీ గాళ్లపై ప్రభుత్వం-పోలీసులు దృష్టి సారిస్తే అక్రమార్కుల కబంధ హస్తాలలో జర్నలిజం-జర్నలిస్ట్ లు చిక్కుకోకుండా కాపాడిన వారు అవుతారు. ప్రభుత్వం కూడా విలేకరులు కావలెను అను ఈ రకమైన అడ్డూ-అదుపు లేని ప్రకటనలు చట్టబద్ధంగా ఎవరికి హాని కలిగించనివిగా ఉన్నాయా? లేదా? అని ఓ ఆధారంతో ప్రకటన ఇవ్వాలి అనే విధానాన్ని తప్పనిసరి చేయాలి. అలాగే ఇలా విలేకరులు కావలెను అను ప్రకటనల్లో రెగ్యులర్ ఉద్యోగ ప్రకటనలు వలే ఉద్యోగం పేరు, విద్యార్హతలు, చెల్లించే జీతం, ఉద్యోగ నియామకానికి జాయినింగ్ ఆర్డర్, కల్పించే సౌకర్యాలు అన్నీ విలేకరులు కావలెను అనే ప్రకటనల్లో వివరణ ఇచ్చేలా ఉంటేనే ఆయా ప్రకటనలు ప్రచురణకు అవకాశం కల్పించాలి. అలా కల్పించగలిగితే విలేకరులు కావలెను అను ప్రకటనలు తప్పనిసరిగా ఇలా ఉండి తీరాలనే ఆంక్షలు వస్తే జర్నలిజంలో దొంగలను ఏరి పారేయవచ్చు.
ఈపూరి రాజారత్నం
సీనియర్ జర్నలిస్ట్
9390062078