తెలంగాణ పోలీసు స్టేషన్ లలో కొత్త గంజాయి టెస్ట్ విషన్లు..!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 ఆగష్టు:
గంజాయి, డ్రగ్స్‌ను సమూలంగా అరికట్టేలా తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ మాదిరిగా గంజాయి టెస్టింగ్ కిట్‌లను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. గంజాయి తాగిన వ్యక్తి యూరిన్ పరీక్ష చేస్తే గంజాయి, డ్రగ్స్ నమూనాలు బయటపడతాయి. 12 రకాల మత్తు పదార్థాలను ఈ కిట్టు ద్వారా గుర్తించవచ్చు. నెల నుంచి 6 నెలల లోపు గంజాయి సేవించిన ఈ కిట్ పరీక్షల్లో తెలిసిపోతుంది.
ఇలాంటి కిట్లు ఏపీలో కూడా ప్రవేశ పెడితే గంజాయి సేవించే వారిని అరికట్టవచ్చు అని షోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.