కర్మ రిటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉందీ పదం..
ఆ ఇద్దరి తీరుతో కర్మ ఫలం ఇదేనేమో అంటున్నారు అంతా…
ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఏంటీ స్టోరీ…???
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/04 ఆగష్టు: ముఖ్యంగా ఆ ఇద్దరు వైసీపీ నేతలను కర్మ వెంటాడుతోందంటున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు ఆ ఇద్దరూ గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు వల్ల ఇప్పుడు ఊరు, వాడ వదలి తిరగాల్సివస్తోందంటున్నారు. సరిగ్గా 60 రోజుల క్రితం వరకు హీరోల్లా రొమ్ము విరిచిన నేతలు తొడకొట్టి సవాల్ చేసిన నాయకులు ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ తమ ఆచూకీ తెలియకుండా తాము ఎక్కడ ఉన్నదీ ఎవరికీ చెప్పకుండా గడుపుతున్నారు. ఆ ఇద్దరి తీరుతో కర్మ ఫలం ఇదేనేమో అంటున్నారు అంతా ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఏంటీ స్టోరీ…???
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రభుత్వం వెంటాడుతోందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత ఈ ఇద్దరూ అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోవడంతో వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి..
ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని అయితే, మరొకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గతంలో టీడీపీలో పనిచేసిన ఈ ఇద్దరూ వేర్వేరుగా వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీలో చేరిన తర్వాత ముఖ్య మంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అయ్యారు.అదే సమయంలో పలు కేసుల్లో వారి ప్రమేయం ఉందని బయట పడటంతో పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత వారం పది రోజులు గుడి వాడలోనే గడిపిన మాజీ మంత్రి కొడాలి నాని ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వలంటీర్లు, బెవరేజస్ కార్పొరేషన్ గిడ్డంగి విషయంలో తమను బెదిరించారని గొడౌన్ యజమానులు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి తనను వేధించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వంశీ కోసం గాలిస్తున్నారు.
అప్పట్లో అంతగా రెచ్చగొట్టిన ఈ ఇద్దరి పేర్లు మంత్రి లోకేశ్ రెడ్‌బుక్‌లో ఒకే పేజీలో ఉన్నాయనీ అప్పటి కర్మ ఇప్పుడు వీరిని వెంటాడుతోందని లోకేశ్ అర్థాంతరంగా సమావేశం ముగిస్తే ఈ ఇద్దరూ ఇప్పుడు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవడం నాటి కర్మ ఫలితమేనని విశ్లేషిస్తున్నారు.
అంతేకాకుండా గన్నవరంలో ఓడిన వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండగా, చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన కొడాలి నాని తన మాటపై నిలబడతారా? అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మొత్తానికి కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని వల్లభనేని వంశీని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేకపోవడంతో వారు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బయటbపడతారనేది ఆసక్తికరంగా మారింది.