9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’: అమిత్ షా
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/04 ఆగష్టు:
భారత దేశంలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైటులో అప్లోడ్ చేయాలని ఆయన కోరారు.