అసెంబ్లీలో అడుగు పెట్టలేనంత దుస్థితి/ఆపదలో మాజీ ముఖ్య మంత్రులు..!!
ఇటు కెసిఆర్ – అటు జగన్
ప్రతిపక్ష నేతలైన కేసీఆర్, జగన్ లు శాసనసభ సమావేశా లకు దూరం కావడం వీరిద్దరి వ్యవహార శైలిపై రెండు తెలుగు రాష్టాల్లో వెల్లువెత్తుతున్న విమర్శల వర్షం.
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి – హైదరాబాద్/04 ఆగష్టు:
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ ప్రజలిచ్చిన తీర్పుకు, రేవంత్ రెడ్డి దాటికి ప్రభుత్వం కుప్పకూలింది పాపం పరాజయాన్ని తట్టుకోలేక ఆరు నెలలు తర్వాత ఆయన అసెంబ్లీకి ఆగమనం చేశారు.
తన ప్రభుత్వం హయాంలో మీడియా పాయింట్ ఎత్తి వేసిన కెసిఆర్ అదే మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని శపధం చేసి మరుసటి రోజే ముసుగేసిన ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.
ప్రతిపక్ష నాయకుని హోదా ఉన్నా అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడాలన్నా రేవంత్ రెడ్డి దాటికి దైర్యం చేయలేక పోతున్నారు.
దేశా రాజకీయాలు దశ – దిశ నిర్దేశం చేస్తా అని పెద్ద పెద్ద డైలాగ్ లు చెప్పి నేడు అసెంబ్లీలో ప్రభుత్వం కెసిఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎత్తి చూపుతుంటే తట్టుకోలేని కష్టకాలంలో ఉన్న కెసిఆర్ మరియు కేసిఆర్ శ్రేణులు.
దేశ్ కీ నేత అవుదామని పక్క రాష్టాల్లో అక్కడ అక్కడ సభలు పెట్టి సొంత రాష్ట్రంలోనే ఎదురైన దౌర్భాగ్యం అంత ఇంత కాదు కటకటాల్లో కూతురు ఉన్నా బయటకు తీసుకురాలేని పరిస్థితి చూస్తున్నాడు గులాబి బాపు.
తెలంగాణ అసెంబ్లీలో గత 9 రోజులు జరిగిన ఘటనలు చూస్తుంటే కెసిఆర్ ఇక జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టడు అనిపిస్తుంది. BRS నాయకులు మొహాల పై నెత్తురు చుక్క లేదు.
ఇంత బతుకు బతికి ఇదేమి ఖర్మ కేసీఆర్ అనేలా ఉంది పరిస్థితి..
ఇక పోతే:
అంతనాడు ఇంతనాడే గంగరాజు అన్నట్లు ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరి ఎగిరి తన్నినట్లు ఉంది. రావాలి జగన్ కావాలి జగన్ అని జగన్ కు అధికారం కూడబెట్టిన తరువాత ఐదేళ్లకే అంతమైన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డి అరాచక ప్రభుత్వం.
పట్టుమని 11 సీట్లతో ప్రజలు బుద్ది చెప్పారు.ఆ గెలిచినా ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కేవలం మొదటి రోజు మాత్రమే ఆలా వచ్చి ఇలా వెళ్లారు జగన్ మోహన్ రెడ్డి.
ఎన్నికల ఫలితల్లో సాధించిన ఘోర పరాజయాన్ని అప్పుడు ఇప్పుడే కోలుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం పై ఉక్కు పాదం అంటూ ధర్నా పేరుతో తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో అట్టర్ ప్లాప్ ధర్నా చేశాడు.
ఆ తర్వాతైనా శాసనసభలో అడుగుపెట్టేందుకు ఎక్కడ సాహసం చేయని జగన్ రెడ్డి.
Y NOT 175 అని, రాష్టంలో ప్రతి పక్షం ఉండకూడదు అని సిద్ధం సిద్ధం అంటూ బిగ్గరగా అరిచి గోల పెట్టి బీరాలు పలికినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించిన దెబ్బకు
గెలిచినా పదకొండు మందితో అధికార పక్షాన్ని ఎదిరించలేని పిరికితనం చుస్తునారు.
తనకు రాదని తెలిసిన ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి రానంటూ జగన్నాటంకు తెరలేపారు. తాడేపల్లి లో ఇంట్లో ప్రోజెక్టర్ లో ప్రభుత్వంలో అరాచకాలు అవినీతి అంటూ కావాల్సిన, ఇష్టమైన, భజన చేసే కొందరు మీడియా వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకొని, లోపలకు అనుమతి ఇచ్చి ఒక్కే ఒక్క కెమెరా పెట్టి ఉక దంపుడు ప్రసంగాలు ఇస్తున్నాడు. తన ఆవేదన ఏంటో అసెంబ్లీలో అడుగు పెట్టి అడగొచ్చు కదా..❓
ఇప్పుడు ప్రభుత్వంలో లేడు కోర్ట్ కేసులు తరుమూకొని వస్తున్నాయి పదకొండేళ్లగా సీబీఐ, ఈడీ కేసులు ఉన్న ప్రజల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నాను అంటూసాకులు చూపి కోర్ట్ కు వెళ్లకుండా మభ్య పెట్టడు ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది.
తాజాగా అవినీతి అక్రమాల పుట్టలు బయట పడుతుండటంతో, జగన్ బెంగళూరులో తిష్ట వేసి బెంగళూరు తాడేపల్లికి వారంతపు పయనం చేస్తూ దేశం వదిలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ గుసగుసలు.
జగన్ నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారు అనేది కార్యకర్తల మాట.
ఏ క్షణాన అరెస్టు చేస్తారో అని భయం భయంగా బిక్కు బిక్కు మంటూ బతుకుతు జీవితం సాగుతుంది.
తనకే దిక్కు లేదు ఇక కార్యకర్తలకు, నాయకులకు ఏమి భరోసా ఇస్తాడు అనేది చర్చ..❗
ఇటు కెసిఆర్ – అటు జగన్
ప్రతిపక్ష నేతలైన కేసీఆర్, జగన్ లు శాసనసభ సమావేశా లకు దూరం కావడం వీరిద్దరి వ్యవహార శైలిపై రెండు తెలుగు రాష్టాల్లో వెల్లువెత్తుతున్న విమర్శల వర్షం.
మొక్కుబడిగా వచ్చి అసెంబ్లీలో మొఖం చాటేశారని ఇంటా బయట ఒకటే ప్రచారం.
జోరుగా సాగుతున్న చర్చల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు జవసత్వాలు నింపలేని దయనీయ పరిస్థితి.
ప్రజలు అధికారం అప్పచెప్పేది… బాధ్యత గా మలుచుకోమని… అహంకారం తో అధికారం దూరం చేసుకోమని కాదు…
అభివృద్ధి – సంక్షేమం ఎంత ముఖ్యమో…
అహంకారం – అణిచివేత ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పులు తట్టుకోవడం అంతే కష్టం..!