హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 ఆగష్టు: BSNL కొన్ని రాష్ట్రాల్లో ‘5G-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్వర్క్ అప్గ్రేడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే 5G నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా సిమ్ కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5G-రెడీ సిమ్కార్డు’లను అందిస్తున్నట్లు BSNL వివరించింది.