వయనాడ్‌లో 100 ఇళ్లు నిర్మిస్తాం: సీఎం సిద్ధరామయ్య
హ్యూమన్ రైట్స్ టుడే/కేరళ/03 ఆగష్టు: భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో అతలాకుతలమైన కేరళలోని వాయనాడ్ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా సహాయాలు వెల్లు వెత్తుతున్నాయి. బాధిత ప్రజలకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ తరుపున 100 ఇళ్లను నిర్మిస్తామని రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు.