ఒక మెట్ పల్లిలోనే 7 నెల్లల్లో 1084 కుక్క కాట్లు
హ్యూమన్ రైట్స్ టుడే/మెట్పల్లి/ 03 ఆగష్టు: ఒక మేట్పల్లి లోనే అత్యధిక కుక్కకాటు కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళన కల్గిస్తుంది. మెట్ పల్లి – గత 7 నెలల్లో సుమారు 1084 కుక్క కాటు కేసులు నమోదైనట్లు ప్రభుత్వ హాస్పిటల్ లెక్కలు చెబుతున్నాయి.
మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పట్ల ప్రజలు మండి పడుతున్నారు.