భారీస్థాయిలో (256 ) కిలోల, 64 లక్షల విలువ గల గంజాయి పట్టివేత..
గంజాయి స్మగ్లర్ల అరెస్టు..
హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్/03 ఆగష్టు: భారీ స్థాయిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 64 లక్షల విలువ గల 256 కిలోల గంజాయితో పాటు, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. బానోత్ బాబు కుమారస్వామి(30), తండా, భూపాల్పల్లి జిల్లా. 2. నస్కరి కుమారస్వామి (30), నెరుడువల్లి, భూపాల్పల్లి జిల్లా. ప్రస్తుతం మరో ముగ్గురు నిందితులు 1) జలెందర్ నివాసం మహబూబాబాద్ 2) అంగోతు రాజేందర్ నివాసం భూపాల్పల్లి జిల్లా, 3) ముకుంద్ నివాసం డొంకరాయి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం పరారీలో వున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, IPS వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు బానోత్ బాబు కుమారస్వామి మరియు నస్కరి కుమారస్వామిలు కారుడ్రైవర్ గా జీవనం కోనసాగిస్తుండగా మిగితా నిందితులతో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. వీరందరు సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయి మండలం పరిసరాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఇదే తరహాలో డొంకరాయి మండలం లోని ముకుంద్ తో పరిచయం ఏర్పడి మిగితా నిందితులతో కల్సి డొంకరాయి గ్రామంలో 256 కిలోల గంజాయిని కోనుగోలు చేసి దానిని రెండు కిలోల చొప్పున 128 ప్యాకెట్ల లో ప్యాక్ చేసి కారులో ఎవరికి అనుమానం రాకుండా భద్రపర్చి, డొంకరాయి నుండి భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకి నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు అందిన పక్కా సమచారంతో, ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు, తమ పరిధిలో కమలాపురం క్రాస్ రోడ్డు, నర్సంపేట దగ్గర వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను గుర్తించిన నిందితులు కారులో తప్పించుకుని పారిపోయే క్రమంలో వాహన తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమయి నిందితుల కారును అడ్డగించి కారును తనిఖీ చేయగా కారులో గంజాయి ప్యాకేట్లను గుర్తించిన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో బానోతూ బాబు కుమారస్వామి, జలెందర్ గతంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డ కేసులు నమోదు కాబడ్డాయి. ఈ ముఠా సభ్యులను అరెస్టు మరియు గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఏసిపి మధుసూదన్, కిరణ్ కుమార్ ఏసీపీ నర్సంపేట, ఇన్స్‌స్పెక్టర్లు సార్లరాజు, రమణమూర్తి, ఎస్.ఐలు శరత్ కుమార్, భాను ప్రకాష్, రఘుపతి, ఏ.ఏ.ఓ సల్మాన్ పాషా, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ళు అశోక్, కానిస్టేబుళ్ళు సురేష్, మహబూబ్ పాషా, నేరెళ్ళ సాంబరాజు, రాజేష్, శ్రీనివాస్, సురేందర్ శ్రవణ్ కుమార్, నాగరాజులను మరియు నర్సంపేట పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.