హ్యూమన్ రైట్స్ టుడే/హన్మకొండ/03 ఆగష్టు: హన్మకొండ జిల్లాలో విద్యుత్తు మోటార్లను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ పొలాలకు నీరు పారించేందుకు ఎస్సారెస్సీ కాలువపై ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్లను దొంగతనం చేసి అమ్ముతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల నుంచి మోటార్లను స్వాధీన పరుచుకున్నారు.