హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 ఆగష్టు: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆగస్టు 10, 11, తేదీలలో నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్, కాన్ఫరెన్స్ హాలులో రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించబడుననీ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ శంకర్ లాల్ చౌరసియా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలోని వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, నూతనంగా వినియోగదారుల సంఘాలను స్థాపించదల్చినవారు, హాజరగుదురు అని అన్నారు. రెండు రోజులపాటు జరిగే వర్క్ షాప్ లో నూతన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019, ఆహార భద్రత చట్టం, తూనికల కొలతల శాఖలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు ISI, BIS, Hal Mark, AgMark, Silk Mark, తదితర నాణ్యత ప్రమాణాల చిహ్నాల గురించి, RERA (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్) సంబంధిత శాఖల అధికారులు వివరించెదరు అని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించబడును అన్నారు. ఈ సమావేశంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొన వలసి ఉంటుంది. వివరములకు ఏ. మట్టయ్య కి సాంప్రదించగలరు, సెల్ నెంబర్ : 9440134610, 9059188199. అని పేర్కొన్నారు.