15 రోజుల్లో ఓటర్ల జాబితా పరిశీలన పూర్తి చేయాలి
హ్యూమన్ రైట్స్ టుడే/తెలంగాణ: జిల్లాలో 15 రోజుల్లో క్షేత్రస్థాయి ఓటర్ల జాబితా పరిశీలన పూర్తి చేసి, పీఎస్‌ఈ ఎంట్రీలు వంద శాతం పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన జాతీయ ఓటరు దినోత్సవం, ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల కమీషన్ విడుదల చేసిన గీతాన్ని జిల్లా వ్యాప్తంగా మైకుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. 80 ఏళ్లు పైబడ్డ ఓటర్లను, కొత్తగా నమోదైన ఓటర్లను సన్మానించాల న్నారు. ఈ ఏడు ఓటరు దినోత్సవ థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ ప్రకారం ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటరు దినో త్సవం నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఓటరు కార్డుతో ఆధార్ లింకేజీ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందని, పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
నూతన ఓటర్లకు ఓటరు కార్డులు పోస్టల్ శాఖ ద్వారా వారి ఇళ్ళకు చేరేలా జిల్లాస్థాయిలో అవ సరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మా ట్లాడుతూ, కొత్త ఓటర్లకు ఫామ్ 6తో పాటు ఆధార్ లింకేజీ జరిగే లా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఓటరు కార్డుకు ఆధా ర్ లింకేజీ చేసుకునేలా చైతన్యపరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్ప టివరకు జిల్లాలో 66శాతం ఆధార్ లింకేజీ పూర్తి చేసినట్లు, కరీం నగర్ అర్భన్‌లో 33శాతం మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈనెలలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్, డీఆర్‌డీవో పీడీ శ్రీలతారెడ్డి, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.