హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 03: తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజి పి.సత్యనారాయణ తెలిపారు.
చార్మినార్ జోన్- పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు.
వీరందరూ సివిల్ విభాగం లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు.