హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/03 ఆగష్టు: బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ వైబి ఖురానియాలను కేంద్రం శుక్రవారం తొలగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి కాగా, ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్ అధికారి. ఈ ఇద్దరిని తొలగిస్తున్నట్లు కేబినెట్ నియామకాల కమిటీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబాట్లు పెరగడం కేంద్రం చర్యకు ఒక కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి.