Get real time updates directly on you device, subscribe now.

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత
(జూలై 28 న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా)

విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయినభూమి’ గాలి నీరు ‘ నింగి ‘నిప్పు’నేల అనే పంచభూతాలను  ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతౌల్ల్యత లోపించి మానవ జీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తులకు గురౌతుంది . ప్రకృతి వాతావరణ  పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అత్యంత అవసరం.
ఆధునికీకరణ ‘పారిశ్రామికీకరణ పట్టణీకరణ’  శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పోటీకరణ’ శాస్త్ర ‘సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు ప్రకృతి విద్వంసం దిశగా కొనసాగి పర్యావరణం పలు సవాళ్ళను ఎదుర్కొంటుంది  .
*ప్రకృతి  విద్వంసం*.
మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విద్వంసం చేస్తున్నాడు. ప్రకృతి మీద ఆధిపత్యం సాదిస్తున్ననానే మాయలో పడి మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతి రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది అన్న వాస్తవాన్ని మరిచిపోవడం గమనార్హం.
“ప్రకృతి రక్షితే మానవ రక్షిత “అన్న సత్యాన్ని మరువ కూడదు.
మానవుడు చేసే చర్యలు భవిష్యత్ తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించక పోవడం శోచనీయం.
*మానవ తప్పిదాలు పర్యావరణం*
19వశతాబ్దం నుండి మానవ తప్పిదాల వల్ల ప్రకృతి విధ్వంసానికి గురౌతుంది. ప్రకృతిలో మానవుడు తప్ప మిగతా జీవరాశి (జీవులు) ప్రకృతి చెప్పినట్లు ప్రవర్తిస్తున్నాయి.

ప్రకృతికి భిన్నంగా నడిచే మానవుడు చేసే ప్రతికూల చర్యల వలన ఏపాపం ఎరుగని మూగజీవాలు భారీమూల్యం చెల్లించ వలసి వస్తుంది. మానవుడు సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రగతి మరియు జీవావరణ రంగాల్లో సాధించిన ప్రగతి దాని వల్ల కలిగిన మార్పులు మాత్రం‌ ప్రకృతి స్వచ్ఛతకు ఉనికికి ముప్పుగా పరిమించాయి.  ఒక పక్క‌ వ్యవసాయరంగంలో హరితవిప్లవం  తర్వాత అథిక దిగుబడులు పెంచేందుకు అధిక ఉత్పాదకత పేరున విచ్ఛల
విడిగా వినియోగించిన రసాయనిక ఎరువులు’ క్రిమిసంహారక  మందుల వాడకం ఎక్కువైంది. దీనివల్ల పంట దిగుబడి పెరిగింది కాని గాలి ‘నీరు’ . నేల ‘కలుషితమైనాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. .వ్యవసాయ రంగములో ఉపయోగిస్తున్న క్రిమిసంహారకమంధులు(అనేక వ్యాధులకు) రోగకారకాలు అవుతూ  ప్రజారోగ్యనికి  ప్రమాదకరంగా పరిణమించింది. మరోపక్క అతినీలలోహిత కిరణాల నుండి మానవులను కాపాడే “ఓజోన్ పొరలో” మానవాళి స్వార్థం వల్ల ఏర్పడిన రంధ్రాలు రాను రాను విస్తరిస్తున్నాయి.వీటికి తోడు పట్టణీకరణ ‘పారిశ్రామిక విప్లవం జనాభా పెరుగుదల’- రియల్ ఎస్టేట్ వ్యాపారం ‘అడవుల నరికివేత సహజవనరుల విద్వంసం మితి మీరిన ప్లాస్టిక్ వాడకం  ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి.
  కేంద్ర’ రాష్ట్ర ‘స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి పేరున భారీ ప్రాజెక్టులను కాలుష్యకారక పరిశ్రమలను స్తాపిస్తు పర్యావరణం జీవావరణం ప్రకృతి విద్వంసానికి పాల్పడడం గమనార్హం. దీనివల్ల అనేక సంఖ్యలో వృక్ష జాతులు ‌జంతు జాతులు అంతరించాయి. మరికొన్ని అంతరించి పోతున్న జాబితాలోకి చేరాయి.
*ప్రకృతి రక్షణ తో సుస్తిరాభివృద్ది*
మానవుడు ఉన్నన్ని రోజులు ప్రకృతి  వనరులను ఉపయోగించుకోవాలి. తర్వాత తరానికి అందించాలి. ప్రకృతి వనరులు తరతరాల వారసత్వ సంపద వాటిని  రక్షించాలి. భావి తరాల కోసం వీటిని భద్రపరచాలి.  విద్వంసం చేయకూడదు.వనరులను అనుభవించె హక్కుమాత్రమే వుంది. సమస్త జీవకోటితో నిండిన ప్రకృతిని సమిష్టిగా పంచుకోవాలి.
గడచిన తరాలు ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకున్నారు.ప్రకృతి పర్యావరణాన్ని  సంతులిన పద్దతిలో ఉపయోగించారు.
*ప్రకృతి భూమిని మాతగా ఆరాధన* భారతదేశములో ప్రకృతిని దేవతగా ఆరాధించే సంస్కృతి  వుందన్న చారిత్రిక సత్యాన్ని మరిచి పోకూడదు .ఆధునికీకరణ పేరుమీద ప్రకృతి సహజవనరులను విచక్షణ రహితంగా అపరిమితంగా వినియోగిస్తూ పరిమితవనరులను కాలుష్యం చేస్తూ భావితరాల వారికి ఆర్థిక ‘ఆరోగ్య సమస్యలను కానుకగా ఇస్తున్నాం.వారసులకు సంపద ఇవ్వాలని పోటీ పడుతున్న సమాజంలో స్వచ్ఛత గల ప్రకృతి పర్యావరణాన్ని ఇవ్వాలన్న స్పృహ లోపించింది.సుస్థిరాభివృద్దికి తీవ్ర విఘాతం కలిగించే దోరిణిని సమాజం విడనాడాలి.
*అటవీ క్షీణత  పెరుగుతున్న కాలుష్యం*
విచక్షణా రహితంగా అటవీ సందను ద్వంసం చేయడం కొల్లగొట్టడంవల్ల 33శాతం వుండాల్సిన అడవులు నేడు దేశములో21శాతానికిమించి లేవు.సగటున రోజుకు 333 ఎకరాల అటవీభూమి అదృశ్యమై పోతున్నట్లుసర్వేలు చెబుతున్నాయి.విచక్షణ రహితంగా అటవీ సంపదను  విద్వంసం చేయటం వల్ల ప్రకృతి విపత్తులు ‘అకాల వర్షాలు వరదలు వచ్చి అపారమైన’ ఆస్తినష్టం  ప్రాణ నష్టం సంభవిస్తుంది. మానవ చర్యల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.గాలి కాలుష్యం వల్ల ప్రతి యేటా 70లక్షల మంది మృత్యు వాత పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) తన నివేదికలో వెల్లడించింది. వరదలు’వానలవల్ల కలుషితమైన నీరుతాగి రోగాల బారిన పడి యేటా2లక్షల మంది చనిపోతున్నరాని నీతిఆయోగ్ గణాంకాలు తెలియచేస్తున్నాయి. వ్యవసాయ’ పారిశ్రామిక రంగాల విస్తరన వల్ల 85 శాతం చిత్తడి నేలలను ప్రపంచం కోల్పోయింది.75 శాతం భూఉపరితలం మార్పుకు లోనయ్యింది. .66 శాతం సముద్ర విస్తీర్ణం ప్రభావితమైందన్న అద్యయనాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆధునిక సౌకర్యాల పేరు మీద మానవుడు విలాస జీవితానికి అలవాటుపడి కాలుష్య కారకమైన వస్తువులను ఉపయోగిస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నాడు.పారిశ్రామికీకరణ పట్టణీకరణ విస్తరణ ఫలితంగా వాతావరణములోకి అపరిమిత కర్భన. ఉద్గారాలువిడిచి పెట్టడంవల్ల భూగోళం అగ్నిగోలంగ మారి”సిగ్లో భల్  వార్మింగ్ “కారణమై ఓజోన్ పొర క్షీణతకు మానవ చర్యలే ప్రత్యక్షంగా కారణం కావడం అంతే గాకుండా మనకు ఊపిరిని ఇచ్చేవాయువును కూడ కాలుష్య భరితం చేశాం.
*పెరుగుతున్న వాయు నీరు కాలుష్యం* మనం పీల్చుకునే వాయువు కాలుష్య భరితమైయింది .
నదీ జలాలు కలుషితమై తాగునీటి కోరత ఏర్పడింది. పంటల దిగుబడి లోకీలక పాత్ర పోషించే తేనెటీగలు..ఊరపిచ్చుకలు‌ అంతరించిపోతున్నాయి .పంటల దిగుబడి తగ్గి ఆహారోత్పత్తి కోరత‌ఏర్పడి ఆహార విపత్తు ఏర్పడే ప్రమాదంఉందని పలు‌ అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన***ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్  కన్సర్వేషన్ ఆఫ్ నేచర్* అనే అంతర్జాతీయ సంస్థ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యతులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రకృతి పర్యావరణం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం విద్వంసం ‘
ఇలాగే‌ కొనసాగితే ప్రపంచములోని ప్రతి నాలుగు జీవజాతుల్లో ఒకటి అంతరించిపోయే దశలో ఉన్నట్లు  అబిప్రాయపడింది .
మానవుడు తన మేధస్సు ద్వారా అనేక పరిశోధనలుచేశాడు. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా అనేక ఆవిష్కరణలు చేశాడు.ఆధునిక‌ టెక్నాలజీ వల్లఎంతోప్రగతి’ పురోగతి అభివృద్ధి సాధించాడు.సాధించిన ప్రగతి ప్రకృతి పర్యావరణ వినాశన కరంగా పరిణమించింది. ప్రకృతిని రక్షించుకునే స్థితి రోజురోజుకు క్షీణిస్తుంది.దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఋతువులు‌ గతి మారుతున్నాయి.ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి పోతున్నాయి.వరదలు తుఫానులు’ భూకంపాలు ‘అగ్నిపర్వతాలు ‘”సునామీ” లు మానవ జాతిని భయపెడుతున్నాయి .”కరోనా “లాంటి ప్రాణాంతక  వైరస్‌లు సులువుగా విజృంభించి మానవ జాతిని మృత్యు‌ కుహరంలోకి నెట్టినప్పటికి ప్రకృతి విధ్వంసాన్ని అదుపు చేయక పోవడం శోచనీయం.
ప్రకృతి ఉపద్రవాలు’మానవ దోషాలు ఒకదానికి ఒకటి తోడై ప్రపంచ మానవాళి నేడు భయం గుప్పెట్లో బతుకుతున్నారు.ప్రకృతి పర్యావరణ విద్వంసాన్నిఆపాలి. సహజవనరుల సంరక్షణ ఉపయోగం గురించి అవగాహన కలిగించడానికి ప్రకృతి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పద్ధతుల‌ పట్ల ప్రజలకు అవగాహన చైతన్యము’శిక్షణా కార్యక్రమాలను సదస్సులను ఏర్పాటు చేస్తారు
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం చరిత్ర* ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్నిప్రతి యేటా. జూన్ 5 నాడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.భూమికి కలుగుతున్న రక రకాల కాలుష్యాలను ఎలా తగ్గించాలో చర్చిస్తారు.
*1972 లో తొలి సారి ప్రపంచ* *పర్యావరణ దినోత్సవాన్ని  ఐ’రా’స* *ప్రకటించింది.**మానవ పర్యావరణం అనే అంశంపై స్వీడన్ రాజధాని స్టాక్ హోం వద్ద సదస్సు నిర్వహించింది 1974 లో తొలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపింది. ఈ రోజు మాత్రమే ప్రపంచ దేశాలు భూమి పై ఎంతో ప్రేమను చూపిస్తాయి.. భూమికి అత్యంత హాని చేస్తుంది మానవుడే.
*పలు రకాల కాలుష్యాలు*
ప్రపంచం లోని అనేక దేశాల ప్రభుత్వాలు రకరకాల కాలుష్యాలను సముద్రాల్లో కి పంపిస్తునాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలు  ‘అధిక జనాభా. ‘వీటికి తోడు బూతాపం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న ఎండలు దీనికి కారణం భూతాపమే
తెలంగాణలో 9 యేళ్ళుగా హరిత హారములో కోట్ల మొక్కలు నాటిన చల్లదనం రావటం లేదు దానికి కారణము వాయుకాలుస్యం పెరగడమే
బూమి పై ఉన్న అనేక రకాల జంతువులు ప్రాణులు అంతరిస్తున్నాయి. పక్షులు తేనె తీగలు  పిచ్చుకలు తగ్గిపోవడం వల్ల ఆహార పంటల దిగుబడి తగ్గి కొరత ఏర్పడుతుంది. ఎరువులు పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమి సారవంతాన్ని కోల్పోయి బూమి నాశన మౌతుంది. సముద్ర జీవులను బతకనివ్వడం లేదు .
*ప్రకృతి పర్యావరణ వేత్తలు ఆందోళన* ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లో  పర్యావరణ రక్షణ కనిపించడం లేదని ప్రకృతి పర్యావరణ శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*ఈ సంవత్సరం “ఓన్లీ ది ఎర్త్”(only* *the earth) అనే థీమ్ ఐ’రా’స* ప్రకటించింది.మానవ జాతి జీవించడానికి ఉన్నది ఒకటే భూమి దీనికి ప్రతమ్నాయం లేదు.
భూమి నాశన మైతే  మానవ మనుగడ  ప్రశ్నార్ధకం అవుతుంది. ప్రభుత్వాలు ‘పౌర సమాజం ధరిత్రీని రక్షించుకోవాలి.ధరిత్రీ రక్షణ తో పర్యావరణ ప్రకృతి రక్షణ ప్రగతి పురోగతి సాధనకు సమిష్టిగా ఉద్యమించాలి.

*పర్యావరణ ( ప్రకృతి )రక్షణ పౌరసమాజం పాత్ర*
1)చైతన్యవంత మైన పౌర సమాజం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కొరకు ఉద్యమించాలి .
2)ప్లాస్టిక్.వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్.బ్యాగులస్థానములో జనుపనార సంచులు వాడేట్లు ప్రజలకు అగాహన కలిగించాలి. .3)వాయు కాలుష్యము తగ్గించటానికి వాహనాల వినియోగం తగ్గించాలి. సైకిళ్ల వినియోగం పెంచాలి.కాలినడకు ప్రాదాన్య్యత ఇవ్వాలి.వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించాలి. .4) వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులవినియోగం తగ్గించాలి .సేంద్రీయ’ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.  5)పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సౌరశక్తి  పవన శక్తి ‘జలవిద్యుత్ ను అందు బాటులోకి తేవాలి . 6)పర్యావరణ ప్రకృతి పరిరక్షణకు “3ఆర్ ”  రెడ్యూస్ ( తగ్గించడం)  తిరిగి వాడటం(రీయూజ్) పునరుద్ధరణ (రీసైక్లింగ్)వంటి పద్దతులు మనిషి జీవితములో బాగం కావాలి.7) భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఇంట ఇంకుడు గుంతలు ఏర్పాటు చెయ్యాలి. 8) ప్రతి గ్రామమంలో చెక్ డ్యాములు నిర్మించాలి .”గోబర్ గ్యాస్ ప్లాంట్లను”ఏర్పాటుచేయాలి. 9)అడవుల పెంపకం‌ పెద్ద ఎత్తున చేపట్టాలి . ప్రకృతి పర్యావరణ హితకరమైన చర్యలు చేపట్టాలి  .,ప్రజల భాగస్వామ్యంతో ఎక్కువ మొక్కలు నాటాలి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలి.అటవీ భూములు దురాక్రమణకు గురి కాకుండా కాపాడాలి  .సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి . పెద్ద ఎత్తున సాగుతున్న చెట్ల నరికివేత అరికట్టాలి .ఒకచెట్టు నరికితే10చెట్లు పెంచే విదంగ నిర్బంధ చట్టాలను రూపొందించి అమలు చెయ్యాలి. భూమి కోతకు గురి కాకుండ చర్యలు తీసుకోవాలి.భూసారాన్ని రక్షించాలి చిత్తడి నేలల రక్షణచర్ర్యలు చేపట్టాలి.. 10)”జల కాలష్య్యాన్ని నివారించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. భూగర్భ జలాలను సంరక్షించు కోవాలి.
11)నేటి “కరోనా‌” విపత్తులో ప్రభుత్వాలు సహజవనరుల వినియోగంపై ఉదాసీనతను విడనాడాలి. అభివృద్ధి’సంరక్షణ సామాజిక ‘సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. “మహాత్మాగాంధీ చెప్పినట్లు “ప్రకృతి ప్రతి ఒక్కరిఅవసరాలను తీర్చ గలదు కాని దురాశనుకాదు ‘”అనే మాటను గుర్తెరిగి ప్రకృతి  పర్యావరణ సంరక్షణలో ప్రతివ్యక్తి భాగస్వామి కావాలి.భావి భారత భాగ్యోదయానికి పాటు పడాలి.

12)ప్రభుత్వం మీడియా ప్రసార సాధనాలు సహజవనరుల సంరక్షణతోనే సత్వరాభివృద్ది సాధ్యమన్న విషయం సమాజంలో ప్రచారం చెయ్యాలి.
13)ప్రతి పౌరుడు ప్రకృతి పర్యావరణ సంరక్షణలో  క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా భాగస్వామ్యం పొందాలి.
14)ప్రకృతి రక్షణవల్ల జీవకోటి మనగడ కొనసాగుతుంది .
పౌరులుగా ప్రకృతి పర్యావరణ  సమతౌల్ల్యత లోపించకుండ చూడటం మనందరి‌ భాధ్యత .
ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణ కార్యాచరణ ప్రారంభమైంది . అంతర్జాతీయ సదస్సులు ‘జాతీయ సద్దస్సులు జరుగుతున్నాయి. అనేక చట్టాలు రూపొందించారు. జాతీయ ‘అంతర్జాతీయ చట్టాలు రూపొందించారు. అమలు  చేస్తున్నప్పటికీ  ప్రజల భాగస్వామ్యం లేనిదే అనూహ్య మార్పులు రావు. 15)పర్యావరణ రక్షణ ప్రతి వ్యక్తి జీవన శైలిలో అంతర్భాగం కావాలి. 16)పాటశాల’ కళాశాల’స్థాయిలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి .యూనివర్సిటీ స్థాయిలోప్రకృతిపర్యావరణంపట్ల పరిశోధనకొరకునిధులు కేటాయించాలి . 17)గ్రామ మండల’మున్సిపాలిటి ‘మున్సిపల్ కార్పొరేషన్.స్థాయిలో”పర్యావరణ ప్రకృతి రక్షణ అధికారులను” నియమించాలి .ప్రకృతి రక్షణలో పౌర సమాజాన్ని భాగస్వాములను చెయ్యాలి. ప్రభుత్వం ప్రకృతి రక్షణకుకృషిచేసేవారికి ప్రకృతి మిత్ర అవార్డ్ఇవ్వాలి..పరిసరాల పరిశుభ్రత ‘చెట్లపెంపకం నీటి సంరక్షణ’ నీటిని పొదుపుగా వాడుకోవడం ‘ప్లాస్టిక్ లాంటి హానికారక ఉత్తపతుల నిషేధం. పాఠశాలలో చదివే
చిన్నారులకు ప్రకృతి రక్షణ పట్ల వివిధ పోటీలు నిర్వహించి వారికి ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన చైతన్యం కలిగించాలి. ప్రతి ఇల్లు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కేంద్రం కావాలి. ఇంటి నుండే ప్రకృతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభం కావాలి .స్వచ్ఛంద సంస్థలు: మహిళా సంఘాలు’ యువజన సంఘాలు ‘సామాజిక ‘సాంస్కృతిక సంఘాలు సమిష్టిగా ప్రకృతి పరిరక్షణ ఉద్యమంలో బహుముఖ పాత్ర పోషించాలి.
*ప్రకృతి రక్షణే మానవాళి రక్షణ”అన్నది ఒక నినాదం కాకుండా జీవన విధానం కావాలి.భావితరానికి స్వచ్ఛమైన ప్రకృతిని బహుమతిగా ఇద్దాం. ప్రకృతి పర్యావరణ రక్షణ మందరి కోసం భావి తరాల కోసం మనిషి మనుగడ కోసం. స్వచ్చబారత్’ స్వస్త భారత్ సాధనకై సుస్తిరాభివృద్దితో కూడిన స్వయం స్వమృద్ద భారత్ నిర్మాణానికి పునరంకితమౌదాం
పర్యావరణం లేనిదే మనం లేము. ప్రకృతి లేనిదే  మన అభివృధి లేదు వాటిని కాపాడుదాం. భూమిని
పచ్చగా
ఆరోగ్యంగా ఉంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment