Get real time updates directly on you device, subscribe now.

*జాతీయ తల్లితండ్రుల దినోత్సవం 2024*

*మాతృదేవోభవ పితృదేవోభవ నినాదం కాకుండా సామాజిక జీవన విధానం కావాలి*

మనిషి జీవితంలో తల్లితండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తారు. మానవ జన్మకు తల్లితండ్రులే అధ్యులు. తల్లితండ్రులు ప్రత్యక్ష దైవాలు. జన్మించిన తర్వాత మొట్టమొదట స్పర్శను నేర్పించేది అమ్మ. నడక నడిపించేది నాన్న. అమ్మ జన్మ ప్రదాత. అవుతే నాన్న భవితకు మార్గదర్శకుడు. భావి జీవిత రూపశిల్పి. అమ్మ నాన్నలు ప్రేమను పంచే ప్రేమ మూర్తులు. సంతానం యొక్క సంతోషాలను ‘సౌభాగ్యాలకు ఉన్నతినిచూసిపులకించేవారు తల్లిదండ్రులు. తల్లి తండ్రులు త్యాగానికి ప్రతిరూపాలు. ప్రేమ ఆత్మీయత ‘ఆప్యాయత ‘వాత్సల్యం అనురాగాల సృష్టికర్తలు. వారి ప్రేమకు త్యాగాలకు ప్రత్యామ్నాయం  లేదు. కలుషితం ‘కల్తీ లేని కండిషన్స్ లేని ప్రేమ ఆప్యాయత వాత్సల్యాలను అందించే  కల్ప వృక్షాలు తల్లిదండ్రులు .
*తల్లితండ్రులు -పిల్లల బంగారు భవితకు బాట*
అమ్మ జీవితానికి అర్థం పరమార్థం నేర్పిస్తే నాన్న నడతను ప్రవర్తనను  సామాజిక సవాళ్లను ఎదుర్కొనే ఆత్మ  ధైర్యాన్ని సాహసాన్ని అందిస్తాడు. తల్లితండ్రుల ప్రేమ మందిరంలోని  సుగంధ మల్లెలే  పిల్లలు. తల్లితండ్రులు
అహర్నిశలుశ్రమించి పిల్లల బంగారు భవితకు బాటవేసే
త్యాగధనులు.
*ప్రపంచీకరణ_ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం*
ప్రపంచీకరణ ‘కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ’ విస్తరణతో  హైటెక్ సంస్కృతి రాజ్యమేలటం వల్ల స్వేచ్ఛ’ స్వాతంత్రం కోరుకునే “స్వతంత్ర కుటుంబాల “సంఖ్య పెరిగి ఉమ్మడి కుటుంబాలు విచ్చన్నమై  కుటుంబ విలువలు అంతరించాయి.
తల్లితండ్రులతో కలిసి జీవించే
కుటుంబాల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.
*తల్లితండ్రుల బాధ్యత_ యువత*  వృద్ధాప్యంలో తల్లితండ్రులను చూసుకో వలసిన బాధ్యత నుండి యువతరం తప్పుకుంటుంది .తల్లితండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్పించి తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఒంటరి జీవితానికి అలవాటుపడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
*మానవీయత అంతరించింది*
మాన విలువలు ‘మమత ‘సహనం అంతరించిపోయింది’ వృద్ధాప్యంలోఉన్నతల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు  తల్లితండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
*తల్లి తండ్రుల పట్ల కృతజ్ఞత*
తల్లిదండ్రులకు ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉండడం కనీసబాధ్యతగా గుర్తించాలి. పిల్లలను పెంచి పోషించి పెద్ద చేసి  ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నతికి దోహదపడి వారి భవిష్యత్తు కోసం శ్రమించి ఊతకర్రలుగా నిలిచిన తల్లితండ్రులకు  కృతజ్ఞతలు తెలియజేయాలి .వారి రుణం  తీర్చుకొనే విధంగా ముసులుకోవాలి.
*ప్రేమ ఆత్మీయత  అందించాలి*
తల్లిదండ్రులతో ఆత్మీయంగా ప్రేమ పూర్వకంగా గడపాలి. వారి దీవెనలను పొందడం అభివృద్ధికి వారి సలహాలు తీసుకోవడం అత్యవసరం. కుటుంబ నిర్మాణంలో తల్లితండ్రుల పాత్రను జీవితంలో వారి ప్రాధాన్యతను తెలియచేయాలనే ఉద్దేశంతో  జూలై 28 2024 న ప్రపంచ వ్యాప్తంగా *జాతీయ తల్లితండ్రుల దినోత్సవం* నిర్వహిస్తారు.
1994సం”లోమొట్టమొదటిసారిగా జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం నిర్వహించడం జరిగింది .అమెరికాలో బిల్ క్లింటన్ దీనిని ప్రారంభించారు. కింటెన్ గారి ప్రతిపాదనను ఆమోదించి ఐ’రా’స సభ్య దేశాలలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించి సమాజంలో తల్లి తండ్రుల
ప్రాధాన్యతపట్లపలుకార్యక్రమాలను నిర్వహిస్తుంది.
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా పిల్లలు ప్రత్యక్ష దైవాలైన  తల్లిదండ్రులకు కానుకలిస్తారు. పాద పూజలు చేయడం తల్లితండ్రులను విహారయాత్రలకు తీసుకువెళ్లడం. వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూడగలగడం అందుకు సంబంధించిన పాత జ్ఞాపకాల  వీడియోలు ప్రదర్శించడం .అమ్మానాన్నల త్యాగాల గురించిన చర్చలు . తల్లితండ్రుల విజయగాథలు చెప్పుకోవడం లాంటి కార్యక్రమాలు చేపడతారు .
*తల్లితండ్రులను పీడించకూడదు* తల్లితండ్రులను ఇంటి నుండి గెంటి వేయడం. అనాధాశ్రమాల్లో చేర్చడం. ఆస్తుల కొరకు వారిని హత్య చేయడం.  సూటి బోటి మాటలతో వారి మనసులను గాయపరచడం.  రాక్షస  మనస్తత్వంతో వారిని పీడించడం చేయకూడదు.
*తల్లి తండ్రుల సంరక్షణ_ పిల్లల బాధ్యత* తల్లి తండ్రుల పట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవడం. మనందరి బాధ్యత. పిల్లల అమూల్య సంపద తల్లితండ్రులు . అమ్మానాన్న అంతులేని ప్రేమల నిధులు. మన జన్మదాతలు.
*తల్లి తండ్రులు త్యాగశీలురు* పిల్లల పెంపకంలో తమ జన్మను దార పోసి మన ఉన్నతికి అభివృద్ధికి తమ నవ్వులను సుఖాలను  సంతోషాలు త్యాగం చేశారు.  మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రులను క్షేమంగాచూసుకోవాలి.
*పిల్లలు తల్లితండ్రులతో కలిసి జీవించాలి* తల్లిదండ్రులతో నిత్యం సంతోషంగా గడపడం ఆదర్శవంతమైన విధానమౌతుంది. .మనల్ని పిల్లలుగా పెంచి పోషించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని మన పిల్లలుగా మన  ప్రేమ ఆప్యాయత అనురాగాల బంధాలతో బంధించి చూసుకోవడం మన అందరి బాధ్యత.
*కుటుంబ మానవీయ విలువల రక్షణ*
సమాజంలో అడుగంటి పోతున్న కుటుంబ మానవీయ విలువలను రక్షించాలి.  కుటుంబ పెద్దలు సామాజిక సంఘాలు ‘ స్వచ్ఛంద సంస్థలు’ సామాజిక సంస్థలు ‘ఆధ్యాత్మిక సంస్థలు’ లైన్స్ క్లబ్బ్స్ ‘మహిళా సంఘాలు’ డ్వాక్రా ‘ అంగన్ వాడి ‘తల్లుల సంఘాలు ‘ యువజన సంఘాలు ఎన్’ఎస్’ఎస్ ఎన్సీ’సీ లాంటి స్వచ్ఛంద సంస్థలు  సమాజంలో తల్లిదండ్రుల ప్రాధాన్యత ‘సంరక్షణ వారి హక్కుల రక్షణ ‘ఆరోగ్య రక్షణ వారి  మానసికోల్లాసానికి ప్రశాంత జీవన విధానానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించాలి. సీనియర్ సిటిజన్స్ హక్కులు ‘ పేరెంట్స్ హక్కులు వారి సంరక్షణ  పథకాలు చట్టాల మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.  
*మానవీయ విలువలు కుటుంబ విలువలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి*
ప్రభుత్వం తల్లితండ్రుల సంరక్షణ మానవీయ విలువలు ‘ నాగరికత సంస్కృతి  ‘మొన్నగు అంశాలను పాఠశాల ‘ కళాశాల యూనివర్సిటీలో’ స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి.
*కమ్యూనిటీ హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి*
ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్’ కౌన్సిలింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలి. కుటుంబ తగాదాలు వివాదాలు తీర్చడానికి ప్రత్యామ్నాయ కౌన్సిలింగ్ కేంద్రాలను నెలకొల్పాలి.
*మధ్యవర్తిత్వ తగాదాల పరిష్కార వ్యవస్థను నెలకొల్పాలి*
తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య తలెత్తిన వివాదాలను సంప్రదింపులు వ్యవస్థ ద్వారా పరిష్కరించే ప్రత్యెక మధ్యవర్తిత్వ తగాదాల పరిష్కార వ్యవస్థను నిర్మాణం చేయాలి.
*కుటుంబ వ్యవస్థ పునర్జీవనం*
వసుధైక కుటుంబ భావ పరివ్యాప్తి ద్వారా కుటుంబ వ్యవస్థ పునర్జీవనానికి తగు వాతావరణాన్ని సృష్టించాలి.
కేంద్ర’ రాష్ర్ట’ స్థానిక ప్రభుత్వాలు మానవ వనరుల సర్వతోముఖాభివృద్ధికి అపార అనుభవాలున్న  సీనియర్ సిటిజన్స్’ రిటైర్డ్ ఎంప్లాయీస్ ‘ తల్లిదండ్రుల సలహాలు తీసుకొని కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ కొరకు ఉద్యమించాలి.
మనకు జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవమైన తల్లి తండ్రులకు ప్రేమ’ ఆప్యాయత అనురాగాలు పంచుతూ వారికి ప్రశాంత సంతోష జీవన  పరిస్థితులు కల్పించడం మన అందరి సామాజిక బాధ్యత.

(జూలై 28 జాతీయ తల్లితండ్రుల దినోత్సవం సందర్భంగా)

నేదునూరి కనకయ్య
రాష్ర్ట అధ్యక్షులు సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment