సహాయం కోసం వచ్చిన క్యాన్సర్ బాలుడిని కన్నెత్తి చూడని సీఎం..
సీఎం కోసం ఆరు గంటలుగా వర్షంలో వేచి ఉన్న క్యాన్సర్ భాధిత బాలుడు..
సీఎం సార్ హెల్ప్ మీ’ అని ప్లేకార్డ్ చూపుతూ కేకలు వేసిన ఫలితం శూన్యం..
కనికరించని పోలీసులు అంటు జనం విమర్శలు..
హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్ జిల్లా/30 జూన్: శనివారం వరంగల్ నగరానికి చెందిన సుమారు ఎనిమిది సంవత్సరాల బాలుడు మూడు సంవత్సరాలుగా బోన్ మ్యారో తో భాధ పడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని సహాయం కోసం బాలుడు అతని తండ్రి మధ్యాహ్నం 12.30 లకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ లోకి పోలీసులు అనుమతించకపోవడంతో మధ్యాహ్నం 3.30గంటల వరకు వారు గేట్ ముందే వేచిఉన్నారు. ముఖ్యమంత్రి కలెక్టరేట్ కు వచ్చిన అనంతరం బాలుడిని అతని తండ్రిని లోపలికి అనుమతించారు. కానీ వీరు లోపలికి వెళ్లిన కూడా పోలీసులు సమావేశం జరుగుతున్న మీటింగ్ హాల్ లోకి వెళ్లకుండా వీరిని అడ్డుకున్నారు. బాలుడు క్యాన్సర్ పేషంట్ అని, లోపలికి అనుమతించాలని ఎంత ప్రాధేయపడిన పోలీసులు కనికరించలేదు. చేసేదేమిలేక బాలుడు ‘సీఎం సార్ ప్లీజ్ హెల్ప్ మీ’ అని ప్లేకార్డు చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వరకు అలానే జనంలో నిలుచున్నారు. సాయంత్రం సుమారు 6గంటల సమయంలో సీఎం మీటింగ్ హాల్ నుండి వెళ్లిపోతున్న సమయంలో బాలుడు ప్లేకార్డు చూపిస్తూ ‘సీఎం సార్.. సీఎం సార్ హెల్ప్ మీ హెల్ప్ మీ..అని గట్టిగా కేకలు వేసిన ఫలితం లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి బస్సు ఎక్కి వెళ్లి పోయారు. వర్షంలో తడుస్తూ నిలుచున్న బాలుడిని చూసి అందరు భాధపడ్డారు. పోలీసులు కొద్దిగా మానవతా ధృక్పదంతో కనికరించి బాలుడిని ముఖ్యమంత్రికి వద్దకు తీసుకెళ్తే ముఖ్య మంత్రి సహాయం చేసేవారు కదా అని అక్కడున్న వారు వాపోయారు.