అలుపెరుగని నేతడి శ్రీనివాస్ కు నేడు స్వస్థలంలో అంతక్రియలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 30:
అలుపెరుగని నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియలను ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ నుంచి డీఎస్ భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్‌కు తరలించారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని సాధా రణ వ్యవసాయ కుటుం బంలో 1948, సెప్టెంబర్ 27న జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించారు.
రాజకీయాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో కార్యకర్తగా చేరారు. 1989లో తొలిసారిగా నిజామాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1994లో ఓడిపోయినా 1999, 2004లో వరుసగా గెలిచారు. 2004లో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించి, వైఎస్ క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.
2009లోనూ డీఎస్‌కు పార్టీ అధిష్ఠానం పీసీసీ పీఠాన్ని కట్టబెట్టింది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలై ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన, స్వరాష్ట్రంలో 2014 జూన్ 3 నుంచి 2015, జూలై 2 దాకా శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.