పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ.
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/29జూన్: శింగనమల నియోజకవర్గం, బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పరిశీలించారు. వసతి గృహ గదులలో పైకప్పు సిమెంట్ స్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఉండడం చూసి సంబంధించిన వసతి గృహ వార్డెన్ ఫై అసహనం వ్యక్తం చేశారు. స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిన సంగతి గురించి సంబంధించిన అధికారులకు తెలిపినారా లేరా అని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ అధికారిని ప్రశ్నించారు.