ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్..

Get real time updates directly on you device, subscribe now.

🔹సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.

🔹రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం.

🔹రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ లో  ప్రెస్ మీట్ నిర్వహించి సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలెర్ట్ అయినా అధికార యంత్రాంగం.

🔹అడ్డుకుంటామని ప్రకటించకున్నప్పటికి హౌస్ అరెస్టు చెయ్యడం పై రాకేష్ రెడ్డి సీరియస్.

*రాకేష్ రెడ్డి కామెంట్స్:-*

👉ప్రజా పాలనలో పోలీస్ లా పహారాలు, నిర్బంధాలు ఎందుకు?

👉ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ ఆంక్షలు ఎందుకు?

👉ఆరు నెలల పాలనకే ఇంత యాష్టకొచ్చిందా? అంత అభద్రతా భావమా, ఇంత అరచకమా?

👉మాకు కొట్లాడటం కొత్తకాదు. కానీ, కొత్త ప్రభుత్వం కాబట్టి, మేం కేవలం నిర్మాణాత్మక సూచనలు, ప్రజల కోణంలో విజ్ఞప్తులు మాత్రమే చేశాం.

👉ముఖ్యమంత్రి సహా సగం క్యాబినెట్, ఎంపీ లు, ఎంఎల్ఏ లు ఒక ప్రయివేటు హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఎగేసుకొని వస్తున్నప్పటికీ వరంగల్ కు ముఖ్యమంత్రి వస్తున్నాడన్న వాతావవరణం, ఆ కళే లేదు.

👉నా ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయి, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాక సీఎం హోదాలో ఎలా పర్యటించాలో తెలియడం లేదు పాపం.

👉కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుండి తొలగించడం పై సీఎం స్పష్టత ఇవ్వాలి.

👉కాకతీయ కళా తోరణం రాచరిక దర్పం అన్న వ్యాఖ్యలు ఓరుగల్లు మా ప్రజలను తీవ్రంగా బాధించాయి. కాబట్టి, సిఎం రేవంత్ రెడ్డి ఆ మాటలు వెనక్కి తీసుకొని, ఓరుగల్లు ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

👉వరంగల్ దాటే లోగా కాకతీయ తోరణం తొలగింపు పై స్పష్టత రావాలి. లేకపోతే, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులంతా రేవంత్ రెడ్డి ఇంటిముందు టెంటు వేసుకొని ధర్నా చెయ్యాలి.

👉లేదంటే మీ క్యాంప్ ఆఫీస్ ల ముందు ప్రజలు కుర్చుకుంటారు.

👉కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటాం. కానీ, మా ఆత్మగౌరవం మేధ దెబ్బ తీయాలని చూస్తే ఊరుకోం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment