కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/29 జూన్: మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నరు.
ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా, తెలంగాణ ఏర్పడిన తరువాత రాజ్యసభ ఎంపీగా పని చేశారు. అంత్యక్రియలు రేపు ఆయన స్వగృహం అయిన నిజామాబాద్ నందు నిర్వహించ బడును.