అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది…
కాంగ్రెస్ పార్టీ స్థలానికే ఎసరు పెట్టిన దొంగలు…
నకిలీ పత్రాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 50 లక్షల విలువైన మడిగెను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు…
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/28జూన్:
నిజామాబాద్ నగరంలోని శంభుని గుడి వెనకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ కార్యకలాపాల కోసం 75 గజాల స్థలం స్థలం ఉండగా ప్రైవేట్ వ్యక్తులు దుకాణాలు పెట్టుకుని పార్టీకి అద్దె చెల్లిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నకిలీ పత్రాలు సృష్టించి మే 24న పాషా, రిజ్వనా బేగం అనే వారి నుండి మహ్మద్ మాజిద్ అనే వ్యక్తికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.
అధికార పార్టీకి చెందిన స్థలంకే రక్షణ లేదు అంటే పరువు పోతుందని విషయం బయటకు తెలియనివ్వకుండా అంతర్గతంగా విచారణ చేయిస్తున్నారు.