హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్/28జూన్: కొడుకు కోసం ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి తన
మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధి కోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కరీంనగర్ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా తన భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుని 55 ఏళ్ళ వయసులో కూడా ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డకు, కొడుకుకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిపింది. కొడుకు కిడ్నీలు ఖరాబ్ అవడంతో అటు నడుపుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది.