హ్యూమన్ రైట్స్ టుడే/గద్వాల/28 జూన్: ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకేనా పోలీస్ వాహనాలకు వర్తించవా.. నిబంధనలు పాటించని వారిపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా, చర్యలు తీసుకుంటారు. అయితే ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన పోలీస్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా.
నిబంధనలు సామాన్యులకేనా అంటూ పలువురు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పోలీస్ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనాలలో ప్రయాణిస్తున్నారు. రూల్స్ పాటించాలని చెప్పే పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా అని సామాన్య ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాహనం కావడం గమనార్హం. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.