హ్యూమన్ రైట్స్ టుడే/మెదక్/28 జూన్: ‘మాకు సార్లు కావాలి’.. రోడ్డెక్కిన విద్యార్థులు మెదక్ జిల్లా చిన్న శంకరం పేట(M) శాలిపేట ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉందని విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కొత్తగా ఉపాధ్యాయులను నియమించండంటూ గవలపల్లి – రామాయంపేట రోడ్డుపై నిరసన చేపట్టారు. రోడ్డుపైనే వంటావార్పు చేస్తూ నిరసనలు తెలిపారు. టీచర్లను నియమించే వరకు రోడ్డుపైనే తమ నిరసన చేస్తామన్నారు. శాలిపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇద్దరు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు.