రామోజీరావును ‘భారతరత్న’తో సత్కరించాలి:
రాజమౌళి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్08: రామోజీరావు మృతిపట్ల దర్శకధీరుడు రాజమౌళి
సంతాపం వ్యక్తం చేశారు. తన కృషితో 50 ఏళ్లుగా
ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఆయనను
‘భారతరత్న’తో సత్కరించాలని అన్నారు. అదే
ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు.
రామోజీరావు భారతీయ మీడియాలో విప్లవాత్మక కృషి
చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు
దగ్గుబాటి వెంకటేశ్ ట్వీట్ చేశారు.