నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల, ప్రక్రియ

Get real time updates directly on you device, subscribe now.

హైకోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాకు మినహాయింపు..


టెట్ లేకుండానే టీచర్లకు ప్రమోషన్స్..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/జూన్ 08: రాష్ట్రంలో శనివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.

వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలను చేపడతామని స్పష్టం చేశారు. మూడేండ్ల లోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు తప్పని సరి బదిలీ నుంచి మినహా యింపు ఉంటుందని వివరించారు. మల్టీజోన్‌-1 పరిధిలో శనివారం నుంచి ఈనెల 22 వరకు, మల్టీ జోన్‌-2 పరిధిలో శనివారం నుంచి ఈనెల 30 వరకు బదిలీలు, పదోన్న తుల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.

కోర్టు కేసులతో గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపో యిందో అక్కడి నుంచే ఇప్పుడు ప్రారంభమ వుతుందని పేర్కొన్నారు. టెట్‌తో సంబంధం లేకుం డానే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని వివరించారు. హైకోర్టులో స్టే ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 19 వేల మంది ఉపాధ్యాయు లకు పదోన్నతులు లభించే అవకాశమున్నట్టు తెలిసింది. బదిలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 81,069 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు.

వారిలో సుమారు 60 వేల మంది వరకు బదిలీ అయ్యే అవకాశముందని సమాచా రం.గతేడాది ఆగస్టు, సెప్టెం బర్‌లో పదోన్నతులు, బదిలీ ల ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. పదోన్నతులకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపో యింది.

దానికితోడు 317 జీవో వల్ల ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు రావడం వల్ల తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నా మంటూ ఉన్నత న్యాయ స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటికే మల్టీజోన్‌-1లో గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతు లు, బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు.

782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్‌ అసిస్టెం ట్‌ బదిలీలు కూడా పూర్త య్యాయి. అయితే స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులను చేపట్టలేదు. బదిలీ అయిన వారిని పాత స్థానాల నుంచి రిలీవ్‌ చేయలేదు. ఎస్జీటీల బదిలీలు కూడా ఆగిపో యాయి.

మల్టీజోన్‌-1 పరిధిలో బదిలీ అయిన స్కూల్‌ అసిస్టెంట్ల ను వెంటనే రిలీవ్‌ చేయా లని బుర్రా వెంకటేశం ఆదేశించారు. శని, ఆదివా రాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల వివరాలతోపాటు సీనియార్టీ జాబితాను అందుబాటులో ఉంచాలని కోరారు.

ఈనెల 10,11 తేదీల్లో సీని యార్టీ జాబితాపై అభ్యంత రాలను స్వీకరిస్తామని తెలిపారు. 12న తుది సీనియార్టీ జాబితా అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈనెల 13 నుంచి 16 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు ఎస్జీటీలు, తత్సమాన క్యాడర్‌ వారు వెబ్‌ఆప్షన్లను నమోదు చేస్తారని పేర్కొన్నారు.

ఎస్జీటీలకు జిల్లా పరిషత్‌, ప్రభుత్వ యాజమాన్యాల్లో అన్ని సబ్జెక్టులకూ పదోన్నతులను కల్పించి ఉత్తర్వులను జారీ చేస్తారని తెలిపారు. 17న ఎస్జీటీల ఖాళీల వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు ఎస్జీటీల బదిలీల కోసం వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు.

బదిలీల కోసం కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని వివరిం చారు. ఈనెల 21,22 తేదీల్లో ఎస్జీటీల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment