స్కూల్ యూనిఫామ్స్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 08: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రీఓపెనింగ్ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా అందించే స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ రేట్స్ ను పెంచింది. ఈ మేరకు గతంలో రూ.50 గా ఉన్న స్టిచ్చింగ్ రేట్స్ ను రూ. 75 లకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం జీవో జారీ చేసింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠ శాలల్లో మౌళిక వసతులకు పెద్ద పీట వేసిన సర్కార్ రీఓపెనింగ్ సమయానికి స్కూళ్లలో మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల రీఓపెనింగ్ జూన్ 12న ఉండటంతో ఇప్పటికే పిల్లలకు ఇవ్వాల్సిన పుస్తకాలు, యూనిఫామ్స్ పాఠశాలలకు చేరుకుంటు న్నాయి.

స్కూల్ రీఓపెనింగ్ కార్యక్ర మంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పాల్గొనను న్నారు. ప్రభుత్వ పాఠశాల లోని పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపీణీ చేపట్టనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 26 వేల పాఠశాలలు ఉండగా.. వాటిల్లో 19 లక్షల మంది విద్యార్థులు చదువుతు న్నారు. వీరికి పుస్తకాలతో పాటు రెండు జతల యూని ఫామ్స్ అందించనున్నారు. సాధారణంగా ఈ యూని ఫామ్స్ స్టిచ్చింగ్ బాధ్యతను మహిళ సంఘాలకు ఇస్తారన్న విషయం తెలిసిందే.

అయితే స్టిచ్చింగ్ చార్జెస్ తక్కువగా ఉండటంతో తమకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పెంచి తమను ఆదుకోవా లని మహిళ సంఘాలు కలెక్టర్లు, మంత్రులు, సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఊరటను ఇచ్చేలా.. రూ.50 ఉన్న స్టిచ్చింగ్ చార్జెస్ ను రూ.75 లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment