హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 08: మహాకవి శ్రీరంగం శ్రీనివాసురావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికా కనెటికట్ రాష్ట్రంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగానే ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వెంకట రమణ మృతి పట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకట రమణ, ఫైజర్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.