హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 08: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ అంటే క్రమ శిక్షణ, సమయ పాలన, నిబద్ధత అని ఆయన అన్నారు. అడుగుపెట్టిన ప్రతిరంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణమన్నారు.