హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/08 జూన్: రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ‘రామోజీరావు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.