హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే31: టీటీఐపై దాడి..నిందితురాలి అరెస్ట్ గోరఖ్పూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న టీటీఐ పైన దాడికి పాల్పడిన కూకట్ పల్లికి చెందిన కేదారి సత్యవాణిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గురువారం రైల్లో టికెట్ చూపమని అడిగిన టీటీఐపై నిందితురాలు దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలై లాలగూడ రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అనీని మజ్దార్ యూనియన్ నేతలు రవీందర్, మురళీధర్, నిందితురాలిని కఠినంగా శిక్షించాలన్నారు.