మహబూబాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 31: మహబూబాబాద్ పట్టణంలోని నరసింహనగర్ సమీపంలో అప్పుల బాధ తాళలేక మనస్థాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ బత్తిని మనోహర్(50) బలవన్మరణం చేసుకున్నాడు. సంఘటన చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.