45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ద్రవమే ఆహారం
హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/మే 31: 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ..ద్రవమే ఆహారం కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని తెలిపాయి.