జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ/మే 31: మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు. వీటిపై జరిగిన వాదనల్లో భాగంగా ఆయన అభ్యర్థనలను ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని వెల్లడించింది.
మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు.
అయితే ఆ పిటిషన్ లిస్టింగ్‌కు బుధవారం సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది. దాంతో తాజాగా ఆయన దిల్లీ కోర్టుకు వెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ విషయంలో ఈ శనివారంకల్లా స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది. 

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment