ఈరోజు భద్రాచలం మారుతి కాలేజీలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది*
*మారుతి కాలేజీలో ఏం జరుగుతుంది*
*అనేక సమస్యలు సంఘటనలు జరిగినా ఆ కాలేజీ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?*
*కాలేజీ సీసీ కెమెరా డేటాను కాలేజీ యాజమాన్యం డిలీట్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నాం*
*సీసీ కెమెరా డేటాను కాలేజ్ యాజమాన్యం ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది వాటి కారణాలు ఏమిటి*
*తక్షణమే సీసీ ఫుటేజ్ ను బయటపెట్టాలి*
*పోలీసు శాఖ వారు పూర్తి విచారణ చేసి బాధితులపై కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి*
*కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి?కాలేజీ పర్మిషన్ ని తక్షణమే రద్దు చేయాలి*
*PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్*
హ్యూమన్ రైట్స్ టుడే/భద్రాచలం/మే 23:
భద్రాచలం మారుతి కాలేజీలో ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయమని పీడీఎస్ యూ డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ పైన నుండి కింద పడిందని కుంటిసాకులు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు?యాజమాన్యం తీరు అనేక అనుమానాలకు తావునిస్తోందని ఆరోపించారు..
ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాలని ఈ ప్రకటనలో కోరారు.. యాజమాన్యం కాలేజిని కాపాడుకోవడం కోసం వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న విద్యార్థిని పట్టించుకికుండా కాలేజీ యాజమాన్యం అధికారుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు??.విద్యార్థిని ఎలా కింద పడిందని పోలీస్ శాఖ వారు విచారణ చేసి విద్యార్థికి న్యాయం చేయాలి అని అన్నారు. కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి కొంతమంది డాక్టర్లు సమస్య వచ్చినప్పుడు సంఘటనలు జరిగినప్పుడు వాటిని కపుల్చడం కోసం అధికారులకు ముడుపులు అందజేస్తున్నారు ఈసారి కూడా అదే పద్ధతిలో కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తా ఉన్నారని అన్నారు. కాలేజీ పర్మిషన్ ని రద్దు చేయాలి. విద్యార్థుల్ని కాలేజీలో వర్కర్లుగా ఆఫీస్ రూమ్ లో పని చేయిస్తారు విద్యార్థి సంఘాలు PDSU ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా యాజమాన్యం తీరు ఉంటుంది కాలేజీని ఏ సంఘటన జరిగినా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటువంటి కాలేజీని పర్మిషన్ రద్దు చేయాలి యాజమాన్యంపై క్రిమినల్ కేస్ ని నమోదు చేయాలి. విచారణ చేసి విద్యార్థులకి విద్యార్థిని కుటుంబానికి తగు న్యాయం చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు.
PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి,మునిగేలా శివ ప్రశాంత్ 9849599748