హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ/మే 23: బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టును 172 పరుగులకే పరిమితం చేసిన రాజస్థాన్ చేజింగ్‌లోనూ అదరగొట్టింది. దీంతో ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫ యర్ 2లోకి ప్రవేశించింది.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (45) చేలరేగా తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకు న్నాడు.
టామ్ కోహ్లర్-కాడ్మోర్ (20), కెప్టెన్ సంజూ శాంసన్ (17), రియాన్ పరాగ్ (36), షిమ్రాన్ హెట్మెయర్ (26) రాణించారు. ఇక ఆఖర్లో రోవ్మాన్ పావెల్ 16 నాటౌట్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించేశాడు.