ప్రయాస ప్రాంగణం..ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ప్రజలకు తీవ్ర అసౌకర్య0..
గద్వాల ప్రయాణ ప్రాంగణంలో తిరగని ఫ్యాన్లు
హ్యూమన్ రైట్స్ టుడే/గద్వాల్/మే 22: జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆ సంస్థ క్షేత్రస్థాయిలో అమలు చేసేది శూన్యమే. వేసవి కాలం జిల్లాలోని ఆర్టీసీ ప్రాంగణం కనీసం నాణ్యమైన తాగునీరు, చల్లనీరు గాలి అదే పరిస్థితి కనబడటం లేదు. కనీసం దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులకు సేద తీరడానికి కనీసం ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి. ఆర్టీసీ బస్టాండ్ లోనే కనీస సౌకర్యాలు కరువైయ్యాయి అని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారుల స్పందించి బస్టాండ్ ఆభివృద్ధి పథంలో నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరుకుంటున్నారు.