హ్యూమన్ రైట్స్ టుడే/ కొమరంభీమ్ జిల్లా/May 22, 2024: 70 కిలోల నకిలీ విత్తనాల పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో రూ. 1. 50లక్షల విలువ గల 70 కిలోల నకిలీ విత్తనాలను బుధవారం టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ మాట్లాడుతూ. తమకు అందిన పక్కా సమాచారం మేరకు తణిఖీలు చేపట్టామన్నారు. బైక్ లపై నలుగురు వ్యక్తులు మహారాష్ట్ర కు నకిలీ విత్తనాలను తరలిస్తుండగా పట్టుకోబోగా ముగ్గురు పారిపోయారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నామన్నారు.