సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు..
– 48 గంటలు డెడ్‌లైన్.. దాటితే చర్యలే..!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/11 మే: ఓవైపు లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Anumula Revanth Reddy) ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) పై వ్యక్తిగత దూషణలపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (మే 10న) షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసులపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నిరంజన్‌ను ఈసీ ఆదేశించింది. గడువు ముగిసేసరికి వివరణ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు..” అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఏం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది.
🏅🏅🏅🏅మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యూమన్ రైట్స్ మీడియా నాలుగవ ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలతో
🏅🏅🏅🏅
మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మీ చుట్టూ జరిగే సమస్యలు, వార్తలు, మీ alochanalu- రచనలు ఏదైనా వీడియోలు లేదా ఫోటో తో స్క్రిప్ట్ రాసి ఈ గ్రూప్ లో పంపండి. 👇👇👇👇
https://chat.whatsapp.com/HXbaHXL0xpMFnjF58MoOQy
🏅🏅🏅🏅
Web news live updates on https://www.humanrightstodaynews.com/
🏅🏅🏅🏅
దేశ వ్యాప్తంగా తెలుగు భాషలో నిరంతర ప్రసారాలు అందిస్తున్న మన హ్యూమన్ రైట్స్ టుడే టీవి ఛానల్ ఇప్పుడు 24 గంటల నిరంతర ప్రసారాలు అందిస్తుంది.
🏅కార్యక్రమాలు: బ్రేకింగ్ న్యూస్, బులెటిన్ వార్తలు, భక్తి, కిడ్స్ ప్రోగ్రాం, స్పెషల్ స్టోరీస్, పొలిటికల్ సెటైర్స్, సినిమాలు, పాటలు, బర్త్ డే యాడ్స్, మొదలగునవి వీక్షించండి.
🏅🏅🏅🏅
తెలుగు రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ మీడియా (టీవి ఛానల్, డైలీ పేపర్, వెబ్ న్యూస్, యూట్యూబ్) లో పనిచేయుట జిల్లాల వారీగా జిల్లా కరస్పాండెంట్, ఇంచార్జీ, స్టాఫ్ రిపోర్టర్ ల తో పాటు క్రైం రిపోర్టర్, ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్, కెమెరామెన్, స్ట్రింగ్ ఆపరేషన్ లో రిపోర్టర్, సబ్ ఎడిటర్, ఆపరేటర్, మండలాల పరిధిలో రిపోర్టర్ లు కావాలి..
గమనిక: రిపోర్టర్ లకు జాయినింగ్ ఫీజులు ఉండలు.
సంస్థ T&C లకు అనుగుణంగా పనిచేయాలి.
🏅🏅🏅🏅
👇👇👇👇
మన హ్యూమన్ రైట్స్ టుడే టీవీ ఛానల్ యొక్క 24×7 లైవ్ టీవీ ప్రసారాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి చూడండీ..
https://server.vprime.co.in/play/humanrightstv
🏅🏅🏅🏅
Daily paper కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..
https://epaper.humanrightstodaynews.com/
🏅🏅🏅🏅
YouTube Channel
https://youtube.com/@HumanRightsTodayNewsTV?si=b6gX6jNAgv_ZPbnU
🏅🏅🏅🏅
నిత్యం బ్రేకింగ్ వార్తలు చూడడానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ క్లిక్ చేసి మన హ్యూమన్ రైట్స్ టుడే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి install చేసి వీక్షించండి.👇👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.humanrightstodaynews
🏅🏅🏅🏅
మన హ్యూమన్ రైట్స్ సంస్థలో వాలంటీర్ గా సభ్యత్వం కోసం మరియు వాలంటీర్ రిపోర్టర్ గా సభ్యత్వం కోసం ఈ యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు – Powered by Kutumb App
https://kutumb.app/the-human-rights?ref=KWEWL&screen=points_screen_share
🤝🤝🤝🤝
Contact:
బ్యూరో చీఫ్: +919951022529
WhatsApp: 9912502898
Email: hr24x7news@gmail.com
www.humanrightstodaynews.com