మతరాజకియలు చేసే బిజెపినీ ఓడించండి
లౌకిక కాంగ్రెస్ ను గెలిపించండి
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ /10 మే: ఇండియా కూటమి అభ్యర్థి వెలిశాల రాజేంద్ర రావు ని కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిపించాలని మండలంలోని మానకొండూరు, అన్నారం, దేవంపల్లి, కొండపలకల గ్రామాలలో సిపిఎం పార్టీ మానకొండూర్ జోన్ కార్యదర్శి సుంకర సంపత్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరు వాస్తవ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల నడ్డి విరిచే బిజెపి ప్రభుత్వాన్ని ఓడించి, ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం లక్ష 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగిన పోరాటంలో 780 మంది రైతులను పొట్టన బీజేపీ ప్రభుత్వం పెట్టుకుందని మండిపడ్డారు. 450 రూపాయలున్న గ్యాస్ ధరను వెయ్యి రూపాయలకు పెంచిందని, నిత్యావసర వస్తువుల ధరలు 150 శాతం పెరిగాయని ఆన్నారు. ప్రజల యొక్క ఆదాయాన్ని, కష్టజీవుల కనీస వేతనాన్ని పూర్తిగా తగ్గించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేను, బ్యాంకులను, ఎల్ఐసి ని, బిఎస్ఎన్ఎల్ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్య వాటాను తెరిసిందని తెలిపారు ఉన్న రాజ్యాంగ హక్కులను పూర్తిగా హరిస్తూ కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి రావలసిన జీఎస్టీ నిధులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆన్నారు. అందుకే బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ 26 చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలను కుదిస్తూ, కనీస వేతనాలను హరిస్తుందని, రోజువారి కూలీ 178 రూపాలు ఉండాలని బిజెపి నిర్ణయించిందని తెలిపారు. కార్మిక, కర్షక వ్యతిరేకి అయినా ఈ బీజేపీని ఓడించేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు చౌదరి సంపత్, గట్టు సతీష్, రాయికంట శ్రీనివాస్, నలువాల రాజు, శ్రీరాముల నారాయణ, లంబు సంపత్ రెడ్డి, బండి రాయమల్లు, శంకర్, చల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.