హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/10 మే: బిఆర్ఎస్ ప్రచార రథం బోల్తా తప్పిన ప్రమాదం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడి తలకిందులు అయింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడి తలకిందులు అయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.